‘చిత్రం’ తర్వాత దర్శకుడు తేజ (Teja), ఉదయ్ కిరణ్ (Uday Kiran) కాంబినేషన్లో రూపొందిన మూవీ ‘నువ్వు నేను'(Nuvvu Nenu) . 2001 ఆగస్టు 10 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అతి తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ మూవీ.. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన హీరోయిన్ గా అనిత హస్సానందిని (Anita Hassanandani) నటించింది. ఓ పెద్దింటి అబ్బాయిగా హీరో ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో కనిపించగా..
పాలమ్ముకునే వ్యక్తి కూతురిగా.. అనిత ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు టాలీవుడ్లో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ‘నువ్వు నేను’ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ అనిత కాదట. ఈమె పాత్ర కోసం ముందుగా వేరే నటిని అనుకున్నారట. వివరాల్లోకి వెళితే.. ‘నువ్వు నేను’ లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా నటి ప్రశాంతి హారతిని అనుకున్నారట. ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో సునీల్ (Sunil) భార్యగా ఈమె నటించి మెప్పించింది.
దీనికి ముందు ‘ఇంద్ర’ (Indra) సినిమాలో షౌక తాలిఖాన్ కూతురి పాత్రలో ఈమె నటించింది. అంటే దీనికంటే ముందుగానే ‘నువ్వు నేను’ సినిమాలో ప్రశాంతి హారతికి అవకాశం లభించింది. అయితే ‘ఆడిషన్ బాగా ఇచ్చినప్పటికీ.. పాలమ్ముకునే వ్యక్తి కూతురిగా నేను కనిపించాలి. ఫేస్ లో రిచ్ నెస్ అదీ కనిపించకూడదు అని నాతో చెప్పారు.
మేకప్ తో మేనేజ్ చేసే ఛాన్స్ ఉన్నా ఎందుకో టీం నన్ను పక్కన పెట్టారు. ‘నువ్వు నేను’ మాత్రమే కాదు ‘స్వరాభిషేకం’ సినిమాలో లయ (Laya) పోషించిన పాత్ర కోసం కూడా నన్ను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల అది కూడా మిస్ చేసుకున్నాను’ అంటూ ప్రశాంతి హారతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.