అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. పార్ట్ 1 హిట్ అవ్వడంతో ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ‘పుష్ప 2 ‘ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందని వినికిడి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘పుష్ప 2 ‘ తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇది పాన్ ఇండియా సినిమా. అందులోనూ పీరియాడిక్ మూవీ అని తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమాలకి మ్యూజిక్ పెద్ద అసెట్ గా నిలుస్తూ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకపోతే కొన్నాళ్లుగా అతను మ్యూజిక్ డైరెక్టర్లతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. మొదట్లో దేవి శ్రీ ప్రసాద్..ను ఎక్కువ సినిమాలకి వాడుకునే వాడు. కానీ ‘అఆ’ నుండి అతన్ని పక్కన పెట్టాడు. అదే సినిమాకి అనిరుథ్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నాడు.
కానీ అతని డేట్స్ కుదరక మిక్కీ జె మేయర్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు. తర్వాత ‘అజ్ఞాతవాసి’ కి అనిరుథ్ మ్యూజిక్ అందించినా.. అది మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఆ కారణంగా ‘అరవింద సమేత’ కి అతన్ని తప్పించి తమన్ ని తీసుకున్నాడు. ఆ సినిమాకు తమన్ మంచి ఆర్.ఆర్ ఇచ్చాడు. అందువల్ల ‘అల వైకుంఠపురములో’ సినిమాకి కూడా తమన్ ను కంటిన్యూ చేశాడు. అయితే ‘గుంటూరు కారం’ విషయంలో తమన్ తో త్రివిక్రమ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు.
దీంతో అల్లు అర్జున్ సినిమాకి అనిరుథ్ (Anirudh) నే తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ‘జవాన్’ సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ ఇచ్చినందుకు గాను అనిరుథ్ ను అల్లు అర్జున్ పొగుడుతూ.. ‘నా సినిమాకి ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలి’ అన్నట్టు అల్లు అర్జున్ కామెంట్ చేయడం జరిగింది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!