పవన్ కొత్త సినిమాలో మరో జానపద గీతం!
- November 20, 2017 / 12:53 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో “కాటమరాయుడా” అనే జానపద గీతం మాస్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మళ్లీ వారిద్దరి కాంబినేషన్ అనగానే సహజంగానే అటువంటి పాట ఉంటాదనుకోవడం సహజం. అందుకే అభిమానాలను నిరుత్సాహపరచ కూడదని పవన్, త్రివిక్రమ్ కలిసి ఓ మంచి పాటను పట్టుకున్నారు. దానిని తమ సినిమాలో పెట్టేలా సంగీత దర్శకుడు అనిరుద్ తో మంచి బీట్ ని జోడించారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఆ పాట పేరే “కొడకా కోటేశ్వరావా”. దీనిని కూడా పవన్ కళ్యాణ్ పాడడం విశేషం. అజ్ఞాతవాసి సినిమా ఆల్బం లో హైలెట్ గా నిలిచే ఈ పాట గురించి చిత్ర బృందం దాస్తోంది.
సినిమా రిలీజ్ కి ముందు అంటే జనవరి తొలివారంలో ఈ పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్లు గా అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ నటిస్తుండగా.. అలనాటి హీరోయిన్స్ కుష్బూ, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వికట్రీ వెంకటేష్ గెస్ట్ అప్పిరీయన్స్ తో నవ్వులు పూయించనున్నారు. ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి 10 న రిలీజ్ కానుంది.
















