ఏషియన్‌ వాళ్లు ఇంకా ఎంతమంది హీరోలను తెస్తారో?

స్టార్‌ హీరోల పేరు ముందు A అని ఇక యాడ్‌ చేసుకోవచ్చా? అయితే ఇది సినిమా పేర్ల కోసం కాదు, థియేటర్ల కోసం. అంటే AMB.. AVD.. AAAలాగా అన్నమాట. ఈ మూడు షార్ట్‌ ఫామ్స్‌కు పూర్తి పేర్లు మీకు తెలిసే ఉంటాయి. మేం కొత్తగా చెప్పక్కర్లేదు. అయినా తెలియని వారి కోసం చెప్పాలంటే… ఏషియన్‌ మహేష్‌ బాబు, ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ, ఏషియన్‌ అల్లు అర్జున్‌. ఇప్పటికే అర్థమైపోయుంటుంది మేం దేని గురించి చెబుతున్నాం. మొన్నీమధ్య విజయ్‌ దేవరకొండ థియేటర్స్ బిజినెస్‌ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్‌ ఈ రంగంలోకి వచ్చేశాడు.

హైదరాబాద్‌ అమీర్‌పేటలో సత్యం థియేటర్ అంటే తెలియనివాళ్లుండరు. అక్కడ సినిమా చూడని హైదరాబాదీ ఉండరు అంటారు. ఇప్పుడు ఆ థియేటర్‌ AAAగా మారబోతోందని సమాచారం. AAA అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఏషియన్‌ అల్లు అర్జున్‌. అదన్నమాట సంగతి. బన్నీ – ఏషియన్‌ సినిమాస్‌ సంయుక్తంగా సత్యం థియేటర్‌ ప్లేస్‌లో కొత్త థియేటర్‌ను తీసుకొన్నాయట. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. త్వరలోనే ఈ థియేటర్‌ ప్రారంభిస్తారట.

ఈ జోరు చూస్తుంటే ఏషియన్‌ వాళ్లు ఇంకా చాలామంది హీరోలతో కలసి కొత్త థియేటర్లు తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఈ ఆలోచన ఉన్నారనేది ఇప్పుడే బయటకు రాకపోయినా… చాలామంది ఉన్నారనే పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. సినిమాలు చేస్తూ బిజినెస్‌ రంగంలో ఉన్నవాళ్లు మన టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు. అందులో నెక్స్ట్‌ ఎవరు అనేది చూడాలి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus