యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నైపుణ్యాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పగల టాలెంట్ ఉన్న నటుడు ఎన్టీఆర్ అని చాలామంది దర్శకులు వెల్లడించారు. దర్శకధీరుడు రాజమౌళి ఒక సందర్బంలో తను క్రియేట్ చేసిన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటుడు తారక్ అని తెలిపారు. తారక్ ప్రాక్టీస్ చేయకుండానే డ్యాన్స్ స్టెప్స్ వేస్తాడని డ్యాన్స్ మాస్టర్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అనుభవం ఉన్న నటుల ముందు కూడా ఎన్టీఆర్ అద్భుతంగా నటించగలడని కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ తరం నటులలో పౌరాణిక పాత్రలలో నటించి అలవోకగా డైలాగ్స్ చెప్పే సత్తా ఉన్న నటుడు ఎవరంటే ఎన్టీఆర్ అని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. యావరేజ్ సినిమాలను సైతం తన టాలెంట్ తో హిట్ స్టేటస్ కు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతం కావడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ హుషారుగా కనిపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ఇతర భాషల ట్రైలర్లలో ఎన్టీఆర్ డైలాగ్స్ పలికిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీడియా మీట్స్ లో బెంగళూరులో కన్నడలో, చెన్నైలో తమిళంలో అనర్గళంగా మాట్లాడి యంగ్ టైగర్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళంతో పాటు ఎన్టీఆర్ హిందీ కూడా మాట్లాడగలరు. ఎన్టీఆర్ టాలెంట్ ను చూసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఇతర భాషల మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడబడకుండా సమాధానాలను ఇచ్చి ఎన్టీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ 40 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.