RRR Movie: జూన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సైతం తెగ టెన్షన్ పెడుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకు పూర్తవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ లో కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరగనుందని సమాచారం.

జూన్ లో 15 రోజుల పాటు ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ జరగనుందని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. చరణ్, ఎన్టీఆర్ జూన్ షెడ్యూల్ కు ఇబ్బంది కలగకుండా తమ డేట్లను అడ్జెస్ట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ డేట్ ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం వేగంగా జరిగే విధంగా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దాదాపు ఏడు నెలలు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఆర్ఆర్ఆర్ సినిమాపై పడితే మాత్రం సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బిజీ అవుతున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి ఇలాంటి షోలను హోస్ట్ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ సీనియర్ స్టార్ హీరోలను మించి మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus