Star Couple: కూతురి కోసం తప్పట్లేదు.. విడాకుల పై నటుడి కామెంట్స్ వైరల్!

ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పట్లో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అనే అభిప్రాయాలు అందరిలో ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు. సామాన్యులు కూడా చాలా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కాకపోతే సామాన్యులు ఎలాంటి మనస్పర్థలు వచ్చినా కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ సెలబ్రిటీలు అలా కాదు. ముఖ్యంగా సినిమా వాళ్ళు.. ఏమాత్రం మనస్పర్థలు వచ్చినా వెంటనే విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోతున్నారు.

సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. హిందీ సీరియల్స్ తో పాపులర్ అయిన నటి చారు అసోపా అలాగే సుస్మిత సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లై చేశారు. అక్కడితో ఆగకుండా మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అప్పట్లో వీరి విడాకుల వ్యవహారం పై చాలా రచ్చ జరిగింది.

అయితే తాజాగా ఈ జంట (Couple) విడాకులను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజీవ్ సేన్, చారు అసోప ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. అయితే తమ కూతురి కోసం స్నేహపూర్వకంగా కలిసున్నామని చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రాజీవ్ సేన్. ‘మేము విడిపోయినప్పటికీ మా మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. మా కూతురికి మేమెప్పుడూ అమ్మ నాన్నలమే’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై చారు అసోపా ఇంకా స్పందించింది లేదు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus