Akhil: అఖిల్ సినిమాలో మరో స్టార్ హీరో

అక్కినేని నట వారసుల బ్యాడ్ లక్ ఏమిటో గాని మొదటి సక్సెస్ అనేది గట్టిగానే ఊరిస్తోంది. నాగార్జున నుంచి అఖిల్ వరకు కూడా మొదటి సక్సెస్ సెంటిమెంట్ అలానే కంటిన్యూ అవుతున్నట్లు అర్థమవుతోంది. నాగచైతన్య ఎదో కిందా మీదా పడుతూ ప్రస్తుతం ఒక స్టేజ్ లో అయితే ఉన్నాడు. ఇక నాగార్జున ఫోకస్ మొత్తం అఖిల్ మీదే ఉంది. చిన్నోడికి బాక్సాఫీస్ హిట్టు రావాలని ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు.

మొదటి మూడు సినిమాలు బోల్తా కొట్టగా ఇప్పుడు రాబోయే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై కూడా అంతగా నమ్మకం లేదు. కానీ అందరికి సురేంధర్ రెడ్డితో చేస్తున్న సినిమాపైనే ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అఖిల్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా హై లెవెల్లోనే ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు అఖిల్ ను ఎవరు కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. ఆ అవకాశాన్నే సురేందర్ రెడ్డి యూజ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే అఖిల్ ఫీట్నెస్, హెయిర్ స్టైల్ ను చేంజ్ చేయించాడు. ‘ఏజెంట్’ అని హై వోల్టేజ్ టైటిల్ తోనే అంచనాలు పెంచేశాడు.

ఇక సినిమాలో ఒక స్పెషల్ పాత్ర కోసం మరొక స్టార్ హీరోను దింపుతున్నారంట. కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర ఏజెంట్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. ఇక ఏజెంట్ సినిమాలో ఆయన పాత్రలో యాక్షన్ సీన్స్ హై లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus