Mahesh Babu: మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమైన సర్కారు వారి పాట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయ్యింది అసలైతే సర్కారు వారి పాట సినిమా గత ఏడాది లోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ అనుకోకుండా కరోనా పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి సమ్మర్ లో మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఒక విధంగా ఈ సినిమా మహేష్ బాబు సినిమా కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

Click Here To Watch Now

వీలైతే పాన్ ఇండియా రేంజ్ లో కూడా సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు పరుశురాం దాదాపు ఫైనల్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు పాటల షూటింగ్ కూడా పూర్తయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా ఎంతో సమయం పట్టదు. అయితే సినిమా విడుదలకు మధ్యలో ఒక నెల మాత్రమే ఉంది కాబట్టి ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయాల్సి ఉంటుంది అందుకోసమే ఇదే నెలలో వీలైనంతవరకు సినిమా సంబంధించిన అన్ని పనులను కూడా ఫినిష్ చేయాలి అని దర్శకుడు పరశురామ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో మొదటి సారి కీర్తి సురేష్ నటించింది.

ఇప్పటికే విడుదలైన కళావతి పాటకు 80 మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడంతో సినిమాకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఇక త్వరలోనే రెండవ పాట ను కూడా విడుదల చేయాలని కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా లిరికల్ వీడియో సాంగ్ కూడా రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus