మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఈ శుక్రవారం నాడు అంటే ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించగా రాంచరణ్ సహానిర్మాతగా వ్యవహరించారు. అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
దీంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ నమోదవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఈ గత రెండు నెలల్లో పెద్ద సినిమాలు 4 రిలీజ్ అవ్వడం అనే తెలుస్తుంది.వాటిని జనాలు ఎగబడి చూడడం.. అందులోనూ పరీక్షల సీజన్ కావడం.. పైగా ‘మంత్ ఎండ్ కూడా’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక వైపు అనుకుంటే..
ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ నెగిటివ్ గా ఉన్నాయి. సినిమాలో చిరు సరసన హీరోయిన్ లేదు అని కొరటాల ఓ సందర్భంలో చెప్పారు. చిరు సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి అనే ‘సైరా’ సినిమాని చాలా మంది జనాలు చూడలేదు. చిరు సినిమా అంటే మాస్ స్టెప్పులు, ఫైట్ లు, రొమాంటిక్ కామెడీ ఉండాలి. మొదటి రెండు ఉన్నాయి హీరోయిన్ లేదు అంటే చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు.
అందుకే ఇప్పుడు ‘ఆచార్య’ నుండీ మరో ట్రైలర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పించాలని ‘ఆచార్య’ టీం భావిస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ‘ఆచార్య రిలీజ్ ట్రైలర్’ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!