అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్ లో విజయాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న ఏఎన్నార్ తన సినీ కెరీర్ లో వైవిధ్యంతో కూడిన పాత్రలను ఎక్కువగా ఎంచుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో ఏఎన్నార్ తాత పాత్రలో నటించారు. క్రాంతికుమార్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా “నవ్వినా కన్నీళ్లే” అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయితలలో ఒకరైన గణేష్ పాత్రో ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారు.
కథ విన్న తరువాత కొంత సమయం ఆలోచించుకుని ఏఎన్నార్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఏఎన్నార్ కు మనవరాలి పాత్రలో గౌతమి నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల గౌతమి ఆ పాత్రలో నటించలేకపోయారు. ఆ తర్వాత అదే పాత్రకు మీనా ఎంపిక కావడం ఆ సినిమాలో నటించడం జరిగాయి. అయితే సినిమాలో విగ్గు లేకుండా నటించడానికి ఏఎన్నార్ మొదట అంగీకరించలేదు. దర్శకనిర్మాతలు విగ్గులు తయారు చేయించగా ఆ విగ్గులు ఏఎన్నార్ కు సూట్ కాలేదు.
ఆ తర్వాత విగ్గు లేకుండా ఏఎన్నార్ బాగున్నారని అందరూ చెప్పడంతో ఏఎన్నార్ విగ్గు లేకుండా సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1991 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ సినిమా రిలీజైంది. తొలి వారం పెద్దగా కలెక్షన్లు రాకపోయినా రెండోవారం నుంచి పుంజుకొని సీతారామయ్య గారి మనవరాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.