చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లు సమానమేనంటూ పెద్దలు చెబుతూ వుంటారు గానీ అది నీటి మీద రాతలే అన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఒక సినిమా విజయంలో హీరో, హీరోయిన్లు సమానమైన పాత్ర పోషిస్తారు. ఒక్కోసారి హీరోయిన్లే తమ అందం, అభినయంతో సినిమాను భుజాన మోస్తుంటారు. కానీ క్రెడిట్ మొత్తం డైరెక్టర్లు, హీరోలకి వెళ్లిపోతుంది. దీనిపై కొందరు తారలు బహిరంగంనే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ఒకప్పుడంటే కనీసం రెండు మూడు దశాబ్థాల పాటు హీరోయిన్లు వెలుగు వెలిగేవారు. కానీ ప్రస్తుతం వారి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది.
హిట్టు పడిందంటే ఐదారేళ్లు వుంటుంది. లేకపోతే జనానికి ఆమె వచ్చినట్లు కూడా తెలియకుండా ఫేడ్ అవుట్ అవుతూ వుంటారు. ఇంకొందరు తమకు ఒక్క హిట్టయినా రాకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక అసలు మేటర్‌లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా నటించిన `ఆక్సిజన్`(2017)లో రాశీ ఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరికి హిట్లు లేవు.. దీంతో ఇద్దరు భామలు కూడా ఒకే బాటలో పయనిస్తున్నారు. రాశీ ఖన్నా, అను ఇమ్యాన్యుయేల్‌లు తమను తాము నిరూపించుకునేందుకు గాను కొత్త పాత్రలను ట్రై చేస్తున్నారు.
ఇంతకీ ఆ వేషమేమిటంటే.. న్యాయవాది పాత్ర. గోపీచంద్ కథానాయకుడిగా మారుతి రూపొందిస్తున్న `పక్కా కమర్షియల్` చిత్రంలో రాశి తొలిసారిగా నల్లకోటు వేసుకున్నారు. అటు అను ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న `మహా సముద్రం`లో ఆమె న్యాయవాదిగా అలరించబోతోంది. మొత్తంమ్మీద.. రాశి, అను ఒకే బాటలో పయనిస్తున్నారన్నమాట. కాకపోతే, `పక్కా కమర్షియల్`లో రాశిది హాస్య ప్రధానపాత్ర కాగా.. `మహా సముద్రం`లో మాత్రం అనుది కీలకపాత్ర అని సమాచారం. మరి.. వీరిద్దరిలో ఎవరు లాయర్ గా ఆకట్టుకుంటారో చూడాలి.