Anu Emmanuel, Karthi: బంపర్ ఆఫర్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్..!

హీరోయిన్లు ఒక్కసారి అవకాశాలు తగ్గాయి అంటే… ఇక తగ్గుతూనే ఉంటాయి.డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేయాలని చూస్తుంటారు. ఒకవేళ వాళ్ళకు ఆఫర్లు వచ్చినా సెకండ్ హీరోయిన్లు, కీలక పాత్రలు వంటివి మాత్రమే వస్తుంటాయి. ఎవరో ఒకరిద్దరు స్టార్ హీరోయిన్ల విషయంలో తప్ప దాదాపు.. అందరి హీరోయిన్ల విషయంలో ఇదే రిపీట్ అయ్యింది. అయితే ఓ హీరోయిన్ విషయంలో మాత్రం ఇది తప్పయ్యేలా ఉంది. ఆమె ఎవరో హెడ్డింగ్ చూశారు కాబట్టి..

మీకు తెలిసే ఉంటుంది. ఆమెనే అను ఇమ్మాన్యుయేల్..! నాని నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘డిటెక్టివ్’ ‘అజ్ఞాతవాసి’ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న అను ఇమ్మాన్యుయేల్..

‘అల్లుడు అదుర్స్’ ‘మహాసముద్రం’ వంటి చిత్రాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. అయితే అవి కూడా సక్సెస్ కాలేదు. అయితే ఇటీవల వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో అను.. విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ కు మొహమాటపడకుండా రెచ్చిపోయి నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ కు మాత్రం బాగా కలిసొచ్చే విధంగా ఉంది.

ఈమెకు తమిళంలో కార్తీ నటిస్తున్న ‘జపాన్’ మూవీలో అవకాశం దక్కింది. ‘సర్దార్’ తర్వాత కార్తి చేస్తున్న చిత్రం పైగా ఇది అతనికి 25 వ చిత్రం కావడంతో.. దీని పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే అనూ కి మరిన్ని పెద్ద ప్రాజెక్టులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా హిట్టైతేనే సుమీ..!

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus