అనేక ఆసక్తికర విషయాలు చెప్పిన అనుపమ పరమేశ్వరన్!
- October 24, 2017 / 01:16 PM ISTByFilmy Focus
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళ చిత్రం ప్రేమమ్ మూవీతో యువకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది. రీసెంట్ గా శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో టాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. అయినా సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం “ఉన్నది ఒకటే జిందగీ” ఈనెల 27న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అనుపమ సినిమాతో పాటు అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని కోరికని బయటపెట్టింది. “మెగాస్టార్ చిరంజీవి గారు ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో వేసిన డ్యాన్స్ చూసి ఫ్యాన్ అయిపోయాను. ఆయన చేసే సినిమాలో ఒక్క నిమిషం కనిపించే పాత్ర వచ్చినా, చాలా ఆనందంగా చేస్తాను” అని అనుపమ వెల్లడించింది. చిరంజీవి తన అభిమానులను ఎప్పుడూ వదులుకోరు. రాబోవు తన సినిమాల్లో ఓ మంచి పాత్ర అనుపమకు ఇస్తారని టాలీవుడ్ వర్గాలవారు చెప్పారు.












