నిఖిల్ తో నటించడానికి ఒకే చెప్పిన అనుపమ
- March 15, 2017 / 11:03 AM ISTByFilmy Focus
యువ హీరో నిఖిల్ తనకి అద్భుతమైన హిట్స్ ఇచ్చిన డైరక్టర్స్ తో మళ్ళీ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. “స్వామి రారా” చిత్రాన్ని తీసిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం కేశవ అనే చిత్రం చేస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ దాదాపు పూర్తికావచ్చింది. ఈ చిత్రం తర్వాత కార్తికేయ సినిమాని రూపొందించిన చందు మొండేటి తో నిఖిల్ సినిమా చేసేందుకు ఒకే చెప్పారు. ఇతను ప్రేమమ్ తో హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రేమమ్ తెరకెక్కించిన విధానానికి మెచ్చుకున్న అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు.
మలయాళ బ్యూటీ ప్రేమమ్ లోను సుమగా, శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో టాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. చరణ్, నాని సినిమాల్లో కథానాయికగా సిన్ చేసింది. కానీ వెంటనే ఆ ప్రాజక్ట్ ల నుంచి బయటికి వచ్చేసింది. ఆ రెండు సినిమాలను పక్కన ఆపెట్టిన ఈ భామ నిఖిల్ సరసన నటించడానికి ఒకే చెప్పడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















