‘మీటూ’ ‘క్యాస్టింగ్ కౌచ్’ ల ఉద్యమాలు ఇండియన్ లెవెల్లో ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొందరు హీరోయిన్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు తాము అనుభవించిన లైంగిక దాడుల గురించి చెప్పుకొచ్చారు. కొందరు సీనియర్ హీరోలు అలాగే దర్శకులు తమను వేధించారని వారు మీడియా మరియు సోషల్ మీడియా వేదికలుగా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మొదలు పెట్టిన ఈ ఉద్యమం … ఆ తరువాత చిన్మయి, శృతీ హరిహరన్ వంటి వారితో మరింత బలపడింది. ఇక ఇప్పుడు మీటూ అనేది రొటీన్.. దాని పని అయిపొయింది.. దాని వల్ల ఒరిగింది లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మరికొంత మంది అయితే తప్పు రెండు వైపులా ఉంటుందని… ఎదగాలని ఆశపడినప్పుడు లోగిపోయి .. ఇప్పుడు ఇలా మీటూ అంటూ గొడవలు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే మన అనుష్క మాత్రం ఎంతో మెర్చ్యూర్డ్ గా సమాధానం చెప్పింది.
అనుష్క మాట్లాడుతూ.. ” ‘మీటూ’ అండ్ ‘కాస్టింగ్ కౌచ్’ వంటివి కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగంలోనూ ఉన్నాయి. ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం అనేవి తప్పడం లేదు. అంతేకాకుండా మన టాలీవుడ్ లో ఇది లేదు.. నావరకైతే ఈ సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అందుకు కారణం నేను ఏదైనా స్ట్రెయిట్ గా చెప్పేస్తా..! కాబట్టి అవి నా వరకూ రాలేదు. ఒక మహిళ నుండీ పురుషుడు వేరే రకమైన బెనిఫిట్స్ ఆశించడం తప్పు. మహిళలు ఏ రంగంలోనైనా నిలబడి కీర్తి పొందాలంటే సులభ మార్గం ఉంటుంది అలాగే.. కఠినమైన మార్గం కూడా ఉంటుంది. కష్టమైనా నేను కఠిన మార్గాన్నే ఎంచుకున్నాను. ఇలాంటి వాటికి ‘నో’ అని చెప్పడం నేర్చుకుంటేనే… పురుషులు స్త్రీలను గౌరవించడం మొదలుపెడతారు” అంటూ చెప్పుకొచ్చింది మన స్వీటీ.