సన్నబడ్డ అనుష్కను చూడవయ్యా
- January 18, 2018 / 01:29 PM ISTByFilmy Focus
పాపం ‘సైజ్ జీరో’ కోసం పెంచిన బాడీని తగ్గించుకోవడానికి అనుష్క పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఫ్లాపవ్వడంతోపాటు.. అనుష్క తిరిగి షేప్ కి రావడానికి చాలా సమయం పట్టింది. అసలు అనుష్క నటించిన “భాగమతి” రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం కూడా అనుష్క లావు తగ్గకపోవడమే. అయితే.. నిన్న జరిగిన “భాగమతి” తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ కి అనుష్క విచ్చేసిన అనుష్కను చూసి అందరూ షాక్ అయ్యారు. “బాహుబలి 2” ప్రమోషన్స్ లో సైతం లావుగా కనిపించిన అనుష్క.. ఒక్కసారిగా నిన్న మునుపటి అనుష్కలా ప్రత్యక్షమయ్యేసరికి ఆమెను చూసినవాళ్ళందరూ ఆమె ముగ్ధ సౌందర్యానికి మిన్నకుండిపోయారు. ఎప్పట్లానే హుందా ప్రవర్తనతో, సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో అనుష్క అలరించింది.
ఇకపోతే.. “భాగమతి” జనవరి 26న విడుదలవుతుండగా, ఆ సినిమా అనంతరం అనుష్క మరో రెండు సినిమాలు సైన్ చేసినట్లు సమాచారం. ఒకటేమో అజిత్ సరసన కాగా మరొకటి వెంకటేష్ సరసన అని తెలుస్తోంది. చూస్తుంటే.. సన్నబడ్డ అనుష్క మళ్ళీ కథానాయికగా తన సత్తా కాస్త గట్టిగానే చాటేలా ఉంది.














