ఏపీలో టికెట్ రేట్లు పెరిగేది అప్పుడేనా?
- September 7, 2021 / 12:07 PM ISTByFilmy Focus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో అని టాలీవుడ్ స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ సైతం టికెట్ రేట్లు పెరిగితే తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే అతి త్వరలో సీఎం జగన్ టాలీవుడ్ హీరోలకు శుభవార్త చెప్పనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ టికెట్ల సమస్యకు అతి త్వరలో మోక్షం లభించనుందని సమాచారం. టాలీవుడ్ పెద్దలతో చర్చించకుండానే టికెట్ రేట్ల సవరణ జరగనుందని తెలుస్తోంది.
గతంలో ఇచ్చిన జీవోకు ఏపీ ప్రభుత్వం సవరణ చేయనుందని తెలుస్తుండగా టికెట్ రేట్లను ఏ మేరకు సవరిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారుల బృందం టికెట్ రేట్లకు సంబంధించిన కసరత్తును చేస్తోందని అధికారుల కసరత్తు పూర్తైన తర్వాత సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. స్టార్ హీరోలకు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి. టికెట్ రేట్ల సవరణ తర్వాత టాలీవుడ్ పెద్దలతో ఆన్ లైన్ టికెటింగ్, ఇతర వ్యవహారాల గురించి జగన్ చర్చించనున్నారని సమాచారం.

టికెట్ రేట్లు పెరిగిన వెంటనే ఇప్పటివరకు ప్రకటించని సినిమాల టికెట్ రేట్లకు సంబంధించిన ప్రకటనలు సైతం వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. జగన్ సర్కార్ చెప్పే తీపికబురు కోసం టాలీవుడ్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం. అఖండ, ఆచార్య, ఖిలాడీ, లవ్ స్టోరీ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ కావాల్సి ఉండగా అక్టోబర్ నెల నుంచి వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!













