దేశంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ పెద్ద సినిమాల కలెక్షన్లలో ఎక్కువ మొత్తం కలెక్షన్లు ఏపీ నుంచి వస్తాయి. జనాభా ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్లే ఏపీ థియేట్రికల్ హక్కుల విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో కొన్ని సినిమాలు మాత్రం ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణలోనే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తున్నాయి.
అయితే ఏపీలో 400 థియేటర్లు మూతబడ్డాయని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు, మరోవైపు థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటంతో ఏపీలో థియేటర్లు మూతబడుతున్నాయని సమాచారం అందుతోంది. ఏపీలో 400 థియేటర్లు మూతబడటం అంటే సాధారణ విషయం అయితే కాదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తెలుగు సినిమాలకు మాత్రమే ఏపీ సర్కార్ టికెట్ రేట్ల పెంపును అమలు చేస్తుండటం గమనార్హం.
ఏపీ సర్కార్ తమ వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించేలా అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్లను తెగ టెన్షన్ పెడుతోంది. థియేటర్ల ఖర్చులు పెరగడం కూడా టికెట్ రేట్లపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం 600 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయని బోగట్టా. పెద్ద సినిమాలు విడుదలైతే దసరాకు థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
టికెట్ విక్రయాల వెసులుబాటు కోల్పోతే తమకు నష్టం కలుగుతుందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారని తెలుస్తోంది. వేర్వేరు కారణాల వల్ల ఏపీలో థియేటర్లు మూతబడుతుండటం సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ఒక విధంగా షాకేనని చెప్పాలి. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ విడుదలైతే మాత్రమే మూతబడిన థియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.