టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నిఖిల్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్షన్ లో తెరకెక్కిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. స్వామిరారా (Swamy Ra Ra) , కేశవ (Keshava) సినిమాల తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Appudo Ippudo Eppudo
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూస్తే ఈ సినిమా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని అర్థమవుతోంది. “90 శాతం మంది అబ్బాయిలు మందు తాగడానికి కారణం అమ్మాయిలేరా” అనే డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. రిషి అనే రేసర్ పాత్రలో నిఖిల్ ఈ సినిమాలో కనిపించనున్నారు. హర్ష చెముడు (Harsha Chemudu) కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ కానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్ లో కథకు సంబంధించి పూర్తి విషయాలను రివీల్ చేయకపోయినా ఈతరం ప్రేక్షకులను టార్గెట్ చేసి సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. దివ్యాంశ (Divyansha Kaushik) , రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. నిఖిల్ టీజర్ కు సంబంధించిన ట్వీట్ చేయడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ పాల్గొననున్నారని పూర్తిస్థాయిలో క్లారిటీ అయితే వచ్చేసింది.
నిఖిల్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుండగా నిఖిల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నిఖిల్ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం నిఖిల్ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిఖిల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో కెరీర్ పరంగా ఎదగడంతో పాటు కార్తికేయ2 సినిమాను మించేలా పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.