ఏప్రిల్ నెలలో నిరాశపరిచిన సినిమాలు ఇవే!

  • May 2, 2022 / 11:33 AM IST

ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెల మాత్రం తెలుగు సినిమాలకు కలిసిరాలేదని చెప్పాలి. ఏప్రిల్ నెల 1వ తేదీన తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ విడుదలైంది. మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ బాగానే ఉన్నా సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచేలా ఉండటం గమనార్హం. అదేరోజు సేవాదాస్ అనే సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు.

ఏప్రిల్ 8వ తేదీన వరుణ్ తేజ్ నటించిన గని థియేటర్లలో విడుదలైంది. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఫలితం భారీ షాకిచ్చింది. కథ కొత్తగానే ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలవడం గమనార్హం. ఈ సినిమాతో పాటు విడుదలైన డస్టర్, బరి, రెడ్డిగారింట్లో రౌడీయిజం, కథ కంచికి మనం ఇంటికి సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.

ఏప్రిల్ 13వ తేదీన విజయ్ నటించిన బీస్ట్ విడుదల కాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన కేజిఎఫ్2 మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ నెల 3వ వారంలో నాలో నిన్ను దాచానే, ధర్మపురి, బొమ్మలకొలువు సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలేవీ హిట్ కాలేదు. ఏప్రిల్ చివరి వారంలో కణ్మణి రాంబో ఖతీజా, ఆచార్య సినిమాలు విడుదలయ్యాయి.

సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల కణ్మణి రాంబో ఖతీజా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉన్నా ఆ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఆచార్య హిట్టై కేజీఎఫ్2కు గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది. ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలలో కేజీఎఫ్2 సినిమా మాత్రమే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే పలు ఏరియాలలో ఈ సినిమా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus