శ్రీసత్య చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న అర్జున్..! ఆఖరికి అది సాధించాడు..!

బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే లవ్ స్టోరీలకి పెట్టింది పేరు. ఒక్కో సీజన్ లో ఒక్కో జంట లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ ఆఫ్ ద టాపిక్ అయిపోతుంది. అయితే, ఈసారి సీజన్ 6లో అలాంటి ఆస్కారం లేదని అనుకున్నారు చాలామంది. కానీ, అర్జున్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా వన్ సైడ్ లవ్ చేస్తూ శ్రీసత్య చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అయితే, శ్రీసత్య మాత్రం ఎప్పటికప్పుడు అర్జున్ ని ఎవైడ్ చేస్తూ వస్తోంది.

కానీ, బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగంగా గ్లామ్ ప్యారడైజ్ లో గ్లామర్ గర్ల్స్ అథితులని ఎట్రాక్ట్ చేస్తున్నారు. అథితిగా వచ్చిన అర్జున్ దొరికిందే ఛాన్స్ అనుకుంటూ శ్రీసత్య చుట్టూనే తిరుగుతున్నాడు. లవర్స్ బెంచ్ పైన కూర్చుని ఫోటో తీయించుకున్నాడు. అలాగే, నోట్లో గోరుముద్దలు కూడా పెట్టించుకున్నాడు. మొత్తానికి మనోడికి మంచి లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగానే కనిపిస్తోంది. బిగ్ బాస్ కావాలనే వీరిద్దరిని ఇలా వేరే టీమ్స్ గా డిజైన్ చేశారా అని కూడా అనిపిస్తోంది. అసలు మేటర్లోకి వెళితే.,

గ్లామ్ హోటల్ టాస్క్ లో బిగ్ బాస్ హోటల్ కి అపోజిట్ టీమ్ లో ఉంది శ్రీసత్య. సింగిల్ పీస్ డ్రెస్ లో హాట్ అందాలతో రెచ్చిపోతోంది. ఇక అథితిగా వచ్చిన అర్జున్ తనకి టిప్స్ ఇస్తూ అన్ని పనులు చేయించుకుంటున్నాడు. వీరిద్దరి లవ్ ట్రాక్ ఇప్పుడు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. వన్ సైడ్ లవర్ గా ఉన్న అర్జున్ కి మంచి ఛాన్స్ చిక్కింది. దీంతో శ్రీసత్యని అన్నం తినిపించమని, టిప్ గా వెయ్యిరూపాయలు ఇస్తానని చెప్పాడు.

నైట్ డిన్నర్ బయటకి రాగానే శ్రీసత్య అర్జున్ కి అన్నం తినిపించింది. అంతేకాదు, తను తినేటపుడు నువ్వు కూడా తిను అని చెప్తే నీకు పెట్టేటపుడు నేను తినను అంటూ చాలా క్లియర్ గా చెప్పింది. ఫస్ట్ నుంచీ కూడా శ్రీసత్య వేరే వాళ్ల ఎంగిలి తాగను అని, తినను అని క్లియర్ గా చెప్తునే ఉంది. అంతేకాదు, తనని ఎవరైనా టచ్ చేసినా నచ్చదని చెప్పింది. కానీ, టాస్క్ లో మాత్రం అర్జున్ ని భుజం మీద చేయి వేయించి ఫోటో దిగింది. అలాగే, గోరు ముద్దలు కలిపి తినిపించింది. మరి వీళ్లిద్దరి లవ్ స్టోరీని బిగ్ బాస్ ఎలా టర్న్ తిప్పుతాడు అనేది చూడాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus