“అర్జున్ రెడ్డి” ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ బూతులు మాట్లాడడం ఎంతవరకూ కరెక్ట్, కుర్రాడికి బలుపు బాగా పెరిగి అలా మాట్లాడేశాడు, సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఆవేశం తగ్గి మళ్ళీ మామూలు మనిషవుతాడులే. ఇలా విజయ్ దేవరకొండని, అతడి స్పీచ్ ను జస్టిఫై చేసినవాళ్లు చాలామంది ఉన్నారు. కుర్రాడికి అంత ఓవర్ గా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేసినవాళ్లలో నేనూ ఒకడ్ని. కానీ.. ఆ నిమిషం వరకే నా ఆలోచనను నేను సమర్ధించుకోగలిగాను కానీ.. తర్వాత అతడు మాట్లాడినదాంట్లో తప్పేముంది అని నాకే అనిపించింది.
పదుల సంఖ్యలో బడా హీరోలున్న మన తెలుగు చిత్రసీమలో వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో.. “అర్జున్ రెడ్డి” అనే సినిమా గురించి పట్టించుకొనే సమయం ఎంతమందికి ఉంది. లక్షలు తగలేసి పబ్లిసిటీ చేసినా సినిమా జనాల వరకూ వెళ్తుందో లేదో ఎవరికీ క్లారిటీ లేదు. అంతెందుకు ఒక చానల్ లో హీరోహీరోయిన్స్ ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయాలంటే బోలెడన్ని ప్యాకేజీలు ఇవ్వాలి. సదరు ప్యాకేజీలు ఇచ్చినా సినిమా యూనిట్ ఆశించిన స్థాయిలో కవరేజ్ వస్తుందన్న నమ్మకం లేదు. అలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ టైమ్ కోసం, వారి స్టూడియోలకు ఇన్వైట్ చేయడం కోసం అర్రులు చాస్తున్నారు.
అంతెందుకు.. వరుసబెట్టి హిట్లు కొడుతున్న నానీ సినిమాలకే మహా అయితే మొదటి రోజు షోలు మాత్రమే ప్రీబుకింగ్ అవుతున్నాయి. మిగతా షోల బుకింగ్ లు రిలీజ్ టాక్ బట్టి ఉంటాయి. కానీ.. “అర్జున్ రెడ్డి” సినిమా కోసం ఏకంగా రెండ్రోజుల ముందే మొదటి మూడు రోజుల బుకింగ్స్ కి భీభత్సమైన క్రేజ్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఇదంతా విజయ్ దేవరకొండ స్ట్రాటజీ వల్లే సాధ్యమైంది. ఒకపక్క కుర్రాడు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని తిడుతూనే.. మరోపక్క అతగాడి ప్లానింగ్ చూసి మెచ్చుకోకుండా ఉండలేం. ఏదేమైనా రేపు విడుదలయ్యే “అర్జున్ రెడ్డి” హీరోగానే కాక వ్యక్తిగానూ విజయ్ దేవరకొండ కెరీర్ ను నిర్ణయించింది. సొ, సినిమా హిట్ అయ్యి తెలుగు సినిమాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసి.. కాన్సెప్ట్ మూవీస్ తీయడానికి సరికొత్త దర్శకులకు ఉతమిస్తుందని ఆశిద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.