శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం `అర్జున ఫల్గుణ`. ‘జోహార్’ ఫేమ్ తేజ మర్ని ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రిలీజ్ కు ముందు ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణలో టికెట్ రేట్లు అమాంతంగా పెంచేయడం.. అలాగే ‘అఖండ’ ‘పుష్ప’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి పెద్ద సినిమాలు పోటీగా ఉండడం…
టాక్ కూడా చాలా బ్యాడ్ గా ఉండడంతో ‘అర్జున ఫల్గుణ’ కి కొద్దిపాటి ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు.దాంతో ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ గా మిగిలింది.క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
0.21 cr
సీడెడ్
0.15 cr
ఉత్తరాంధ్ర
0.12 cr
ఈస్ట్
0.07 cr
వెస్ట్
0.05 cr
గుంటూరు
0.13 cr
కృష్ణా
0.04 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.86 cr
‘అర్జున ఫల్గుణ’ చిత్రానికి రూ.2.5 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.86 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.చాలా చోట్ల డెఫిసిట్ ల కారణంగా నెగిటివ్ షేర్లు పడ్డాయి. దాంతో బయ్యర్లకి రూ.1.64 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. మొత్తానికి 2021 లో శ్రీవిష్ణు నుండీ 3 సినిమాలు వచ్చాయి. అందులో ‘రాజ రాజ చోర’ మంచి విజయాన్ని అందుకుంది. ‘గాలి సంపత్’ ‘అర్జున ఫల్గుణ’ డిజాస్టర్లుగా మిగిలాయి.