Arjuna Phalguna Collections: హాలిడేస్ ఉన్నా క్యాష్ చేసుకోలేకపోయిన ‘అర్జున ఫల్గుణ’..!

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన‌ చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. ‘జోహార్’ ఫేమ్ తేజ మర్ని ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రిలీజ్ కు ముందు ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచేయడం.. అలాగే ‘అఖండ’ ‘పుష్ప’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి పెద్ద సినిమాలు పోటీగా ఉండడంతో ప్రేక్షకులు వాటికే ఓటు వేశారు.

పైగా ‘అర్జున ఫల్గుణ’ టాక్ కూడా చాలా బ్యాడ్ గా ఉండడంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. ఓసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.14 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.07 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.08 cr
కృష్ణా 0.03 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.57 cr

‘అర్జున ఫల్గుణ’ చిత్రానికి రూ.2.5 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.57 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2 పైనే షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ బ్యాడ్ గా ఉండడం.. థియేటర్లు కూడా తక్కువగా ఉండడం.. డిసెంబర్ పెద్ద సినిమాలు డామినేట్ చేయడంతో ఈ చిత్రానికి కలెక్షన్లు నమోదు కాలేదని స్పష్టమవుతుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus