విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న విడుదల అయ్యింది. ఓ పాట హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం.. వీటన్నిటికీ తోడు ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో హీరో విశ్వక్ సేన్, ఓ యాంకర్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం.. దాని వల్ల ఏర్పడిన కాంట్రవర్సీ వల్ల ఈ మూవీకి బాగా పబ్లిసిటీ జరిగింది. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు.
33 ఏళ్ళు వచ్చినా పెళ్లి కానీ యువకుడిలా అతను కనిపిస్తున్నాడు. రుక్సర్ ధిల్లాన్ అతనికి జోడీగా నటిస్తోంది.మొదటి షోతోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ నమోదైంది.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.వీక్ డేస్ లో కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తుంది.ఒకసారి ఆ కలెక్షన్ల విషయాలను గమనిస్తే :
నైజాం
1.50 cr
సీడెడ్
0.41 cr
ఉత్తరాంధ్ర
0.37 cr
ఈస్ట్
0.23 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.25 cr
కృష్ణా
0.23 cr
నెల్లూరు
0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.18 cr
ఓవర్సీస్
0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.90 cr
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి రూ.5.96 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.9 కోట్ల షేర్ ను రాబట్టింది. చెప్పుకోవడానికి ఈ కలెక్షన్లు బాగా ఎక్కువే..!కానీ పోటీగా సినిమాలు రిలీజ్ కావడంతో ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు దక్కలేదు. అయినప్పటికీ ఈ మూవీ బుకింగ్స్ పర్వాలేదు అనిపించాయి. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.1 కోట్లు షేర్ ను రాబట్టాలి.