Mohan Babu: అసభ్యకరమైన వ్యాఖ్యలతో మోహన్ బాబు పై దూషణ.. మేటర్ ఏంటి?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీని పై డిస్కషన్లు కూడా షురూ అయ్యాయి. విషయం ఏమిటంటే…ఓ యూట్యూబ్ ఛానల్ మోహన్ బాబుని టార్గెట్ చేసి దూషిస్తోందట. అంతేకాదు మోహన్ బాబు వ్యక్తిగత విషయాల పై కూడా పగబట్టుకుని దూషిస్తున్నారంటూ ఆయన ఈ విషయాన్ని లీగల్ అడ్వైజర్, సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అసభ్యకరమైన పదజాలంతో కూడా మోహన్ బాబుని తిడుతూ వీడియోలు పెడుతుందట సదరు ఛానల్.

ఆ వీడియోలను ఆధారం చేసుకుని లీగల్ అడ్వైజర్ సంజయ్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను యాక్షన్ తీసుకోమని కోరారట. దీని పై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తుంది.మోహన్ బాబు వివాదాల్లో నిలవడం అనేది కొత్త విషయం కాదు. కాకపోతే గతేడాది నుండీ ఆయన్ని ఎవరో పర్సనల్ గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. గతేడాది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోహన్ బాబు ఇంట్లోకి ఓ కారులో దూసుకువచ్చి ఆయన్ని బెదిరించారు.

ఆ విషయం పై పెద్ద రచ్చ అయిన సంగతి కూడా తెలిసిందే. అటు తర్వాత ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు మోహన్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆ యూట్యూబ్ ఛానల్ వెనుక కూడా వాళ్ళ హస్తం ఉందా అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus