ఇటీవల విడుదలైన సాయి ధరమ్ తేజ్ సినిమా విరూపాక్ష సందడి మొదలైంది. సాయిధరమ్ తేజ్‌హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవటమే కాకుండా వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మూసాపేటలోని లక్ష్మీ కళ థియేటర్‌పై ప్రేక్షకులు దాడి చేశారు. థియేటర్‌పై ఆడియెన్స్ దాడి చేయటం ఏంటనే సందేహం రాక మానదు. వివరాల్లోకి వెళితే, ఆదివారం సాయంత్రం విరూపాక్ష సినిమాను చూడటానికి ప్రేక్షకులు వచ్చారు. ఆరు గంటలకు స్టార్ట్ కావాల్సిన షో ఎంతకీ ప్రారంభం కాలేదు.
గంటన్నర పాటు వెయిట్ చేసి ఆడియెన్స్ ఇక కోపం తారాస్థాయికి చేరటంతో వారు థియేటర్స్‌లో ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఇక థియేటర్ యాజమాన్యం కూడా ప్రేక్షకులకు టికెట్ డబ్బులను వెనక్కిఇచ్చేసింది. అయితే కొంత మందికి మాత్రమే పూర్తి డబ్బు వాపస్ చేశారని, కొందరికైతే సగం డబ్బులే ఇచ్చారని ప్రేక్షకులు కొందరు వాపోయారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న తెలుగులో విడుదలైంది.
బ్లాక్ బస్టర్ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ను సాధిస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించటం విశేషం. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సహా టెక్నికల్ టీమ్ అంతా తమ వంతు పాత్రను సమర్దవంతంగా నిర్వహించారు. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా ఇది.
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు (Virupaksha) ఈ మూవీని తెరకెక్కించారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు. బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనుకున్నారు. అయితే అనువాదాలకు సమయం లేకపోవటంతో తెలుగులోనే విడుదల చేశారు. అయితే సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో త్వరలోనే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.