Jai Bhim Movie: జై భీమ్ మూవీ పై నార్త్ ఆడియెన్స్ ఫైర్.. కారణం అదే..!

‘మనోభావాలు మేటర్స్ అమ్మా…!’ పలనా సినిమాలో పాలనా వ్యక్తి మాట్లాడిన తీరు … కొందరిని అవమానపరిచేలా ఉంది. వాటిని తొలగించాలి.. ఆ సినిమా మేకర్స్ క్షమాపణ చెప్పాలి. ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. వాటి వలన ఆయా సినిమాలకి మరింత పబ్లిసిటీ జరిగి ప్లస్ అయ్యిందే తప్ప… మరేమీ జరగలేదు అన్నది వాస్తవం. అయితే తాజాగా వచ్చిన మనోభావాల టాపిక్ కాస్త కొత్తది. విషయం ఏంటంటే… ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో ‘జై భీం’ అనే చిత్రం రిలీజ్ అయ్యింది.

సూర్య ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి మంచి ప్రసంశలు దక్కుతున్నాయి. గతేడాది ఆకాశం నీ హద్దురా చిత్రంతో ప్రేక్షకులని మెప్పించిన సూర్య ఈ ఏడాది జై భీమ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇవి రెండు కూడా అమెజాన్ ప్రైమ్ ఓటిటి వేదికగానే విడుదల అయ్యాయి. ఐతే, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటించాడు. పొలీసు ఉన్నతాధికారి పాత్రలో అతను కనిపించాడు. ఓ సన్నివేశంలో.. అతను ఓ కేసులో భాగంగా మార్వాడి నగల వ్యాపారిని విచారిస్తూ ఉంటాడు.అప్పుడు ఆ నగల వ్యాపారి హిందీలో మాట్లాడుతుంటే…

ప్రకాష్ రాజ్ అతని చెంప పై కొట్టి తమిళంలో మాట్లాడు అంటాడు. ఈ సీన్ పై నార్త్ ఇండియన్ సోదరులను హర్ట్ చేసింది. నార్త్ ఇండియన్ కి చెందిన వ్యక్తి హిందీలో మాట్లాడితే తప్పేంటి? దానికే చెంప దెబ్బ కొట్టేయాలా? తమిళంలో మాట్లాడు అని చెబితే సరిపోతుంది కదా అంటూ వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు ప్రకాష్ రాజ్, అలాగే దర్శకుడు వారికి క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాన్ని డిలీట్ లేదా ఎడిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus