నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. బాలకృష్ణ.. అఖండ , వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. దీంతో ‘డాకు మహారాజ్’ పై ట్రేడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేస్తున్న కంటెంట్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు.
Daaku Maharaaj Trailer
వివరాల్లోకి వెళితే… ‘డాకు మహారాజ్’ ట్రైలర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయ్యింది. ఇది కూడా గేమ్ చేంజర్ ట్రైలర్లానే 2 నిమిషాల 43 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇందులో బాలకృష్ణ 3 రకాల షేడ్స్ కలిగి ఉంది. ట్రైలర్లో కథ గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు. పూర్తిగా యాక్షన్ తోనే ముంచేశారు. ఒకటి రెండు డైలాగ్స్ బాగున్నా.. బాలకృష్ణ నుండీ ఆశించే మాస్ డైలాగ్స్ లేవు. కాబట్టి ఈ ట్రైలర్ పెద్దగా వైరల్ కావడం లేదు. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ ట్రైలర్ తో సంతృప్తిగా లేరు అని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సైతం ఈ ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలకృష్ణ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ అయిన అఖండ , వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు ట్రైలర్స్ తోనే హైప్ పెంచాయి. కానీ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వాటి స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సినిమాకి సరిగ్గా వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ‘డాకు మహారాజ్’ చిత్రానికి హైప్ తీసుకురావాలి. లేదు అంటే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల డామినేషన్ ఎక్కువైపోతుంది.
Elago #INDvsAUSTest dobbindi, ika Sankranti movies gurinchi alochiddam.
#DaakuMaharajTrailer making bagundi. Okka notable dialog ledu. Migathadantha Balayya routine template feels. Decent cut. Chuddam how it will raise the hype.