తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రచయితగా డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అవసరాల శ్రీనివాస్ ఒకరు.ఈయన స్క్రిప్ట్ రైటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన మరికొన్ని సినిమాలలో నటుడిగా కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే చాలా రోజుల తర్వాత అవసరాల శ్రీనివాస్ తన దర్శకత్వంలో తెరకెక్కించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ద్వారా మార్చి 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నాగశౌర్య మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈ సినిమా 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల ఓ జంట మధ్య ఉండే ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఈయన మాట్లాడటమే కాకుండా ఇండస్ట్రీలో రచయితల పరిస్థితి గురించి కూడా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇండస్ట్రీలో రచయితలకు పెద్దగా గుర్తింపు లేదని తెలిపారు. ఒకవేళ ఒక మంచి కథను సిద్ధం చేసి దర్శక నిర్మాతలకు ఇచ్చిన వారికి డబ్బులు ఎగ్గొడుతున్నారంటూ ఈయన కామెంట్లు చేశారు. అందుకే తన సినిమా స్క్రిప్టులకు తానే దర్శకత్వం వహిస్తున్నానని ఈయన తెలిపారు. ఇకపోతే తను రాసే కథలకు కూడా డబ్బులు ఇస్తే తప్పకుండా తన కథలను కూడా ఇతరులకు ఇస్తానని ఈయన తెలియజేశారు.
నిజంగా నాకు డబ్బులు ఇస్తే నా కథలను వేరేవాళ్లకు ఇవ్వడానికి నేను రెడీనే. ఇది నేను ఇంకో రైటర్ దగ్గరే నేర్చుకున్నాననీ తెలిపారు.అందరిలా తాను డైరెక్టర్ గా సినిమా మీద సినిమా చేయాలని కోరిక తనకు లేదని ఒక మంచి సినిమాలు 10 చేస్తే చాలు అంటూ ఈ సందర్భంగా ఈయన మాట్లాడారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో రచయితల పరిస్థితి గురించి తెలియజేస్తూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.