జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో తెరకెక్కిన అవ ఈతార్2 సినిమా పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోవడంతో పాటు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ సినిమా హక్కులను కొనుగోలు చేసిన వాళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఏపీలోని 70 ప్రాంతాలలో అవతార్2 సినిమా రిలీజ్ కాలేదని సమాచారం అందుతోంది. డిస్నీ సంస్థ భారీ మొత్తం డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని బోగట్టా. డిస్నీ సంస్థ భారీ మొత్తం డిమాండ్ చేయడంతో థియేటర్ల ఓనర్లు ఈ సినిమా విషయంలో వెనుకడుగు వేశారని తెలుస్తోంది.
మరీ భారీ మొత్తం డిమాండ్ చేసిన డిస్నీ థియేటర్ల ఓనర్ల పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదని చెప్పవచ్చు. ఈ సినిమా నిడివిని కూడా కనీసం 40 నిమిషాల పాటు తగ్గించి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అవతార్2 మూవీ నిడివి విషయంలో వస్తున్న కామెంట్ల గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కొందరు ఈ సినిమా అద్భుతం అని ప్రశంసిస్తుంటే మరి కొందరు మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు.
అవతార్2 ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అవతార్2 కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అవతార్2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో ఈ తరహా కథాంశాలతో తెరకెక్కే సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. అవతార్2 రిలీజ్ విషయంలో తప్పు జరగడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నష్టపోతుండటం గమనార్హం.
ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలై ఉంటే ఈ సినిమాకు మరింత ఎక్కువగా బెనిఫిట్ కలిగేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అవతార్2 సినిమా గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం పాజిటివ్ గా స్పందిస్తుండటం గమనార్హం.