కాబోయే భార్య తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అవినాష్!

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి జోకర్ గా అడుగుపెట్టిన ముక్కు అవినాష్ మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలతో కూడా బిజీగా గడుపుతున్నాడు. అయితే ఎప్పటినుంచో అవినాష్ పెళ్లికి సంబంధించిన కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్గా అతను తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. గత కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో తన ఎంగేజ్మెంట్ వేడుకను సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

చాలా సింపుల్ గా నిశ్చితార్థం వేడుకను పూర్తి చేసుకున్న అనంతరం అవినాష్ ఇటీవల మరోసారి తన భార్యతో ప్రత్యేకంగా ఫోటో షూట్ కూడా నిర్వహించాడు. అయితే వీరి ఫోటో షూట్ లో జరుగుతున్న క్రమంలో మధ్యలో కి వచ్చిన శ్రీముఖి వారిద్దరిని ఆట పట్టించే ప్రయత్నం చేసింది. తనకు కాబోయే భార్య కు ముద్దులు పెడుతూ రొమాంటిక్ స్టిల్స్ ఇస్తుండగా మధ్యలో కి వచ్చిన శ్రీముఖి హ్యాపీ బర్త్ డే అవినాష్ హ్యాపీ బర్త్ అనుజా అంటూ పక్కున నవ్వేసింది.

అంతే కాకుండా.. ఓ బిజీగా ఉన్నారా అంటూ మళ్ళీ వెనక్కి తప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఒక ఇంటివాడు కాబోతున్న అవినాష్ పెళ్లికి ముందు తన భార్యతో ప్రేమ అనుబూతిని పొందుతున్నాడు. అంతేకాకుండా ఫోటోలను వీడియోలను కూడా విడుదల కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక వీరి వివాహం నవంబర్లో జరగనున్నట్లు తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

8

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus