దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి రెండేళ్లక్రితం రిలీజ్ అయి అప్పటివరకు తెలుగు సినిమాల పేరిట ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో 600 కోట్ల గ్రాస్ వసూల్ చేసి ఇతర సినిమాలకు భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఈ చిత్ర దరిదాపులకు ఈ తెలుగు మూవీ వెళ్ళలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150 మూవీ ఖైదీ నెంబర్ 150 కలక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో బాహుబలి బిగినింగ్ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టి బాక్స్ ఆఫీస్ కి బాస్ అని చిరు నిరూపించుకున్నారు.
మొత్తం మీద ‘ఖైదీ నంబర్ 150’ 160 కోట్ల గ్రాస్, 105 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ రికార్డు బాహుబలి కంక్లూజన్ వరకే ఉంటుందని, సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే ఖైదీ రికార్డులన్నీ మరుగున పడిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్, రానా పోటాపోటీగా నటించిన బాహుబలి 2 పై విపరీత క్రేజ్ ఉంది. అందుకే నిర్మాతలు ఈ సినిమాని దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ డే కలక్షన్స్ వందకోట్లు దాటిపోతుందని వారు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.