ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు లేదా షూటింగ్ సగంలో ఉన్నప్పుడు ఒక సంస్థలో రూపొందుతున్న సినిమాని మరో సంస్థ టేకోవర్ చేయడం లేదా “ఖలేజా” తరహాలో ఒక సంస్థ నిర్మించిన సినిమాను మరో సంస్థ రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. కానీ.. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా కనీసం ఇంకా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలవ్వని చిత్రాన్ని దక్కించుకోవడం కోసం ఒక సంస్థ ఏకంగా 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. ఆ సంస్థ ఏదో కాదు “బాహుబలి”ని నిర్మించిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.
ఇంతకీ విషయం ఏమిటంటే.. “భరత్ అనే నేను” లాంటి సూపర్ హిట్ అనంతరం డి.వి.వి.దానయ్య తన సంస్థలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా ఓ సినిమా మొదలెట్టిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవ్వనుంది. ఈలోపు సినిమాను కైవసం చేసుకోవాలనుకొంది ఆర్కా మీడియా సంస్థ. అందుకోసం దానయ్యకు 100 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసిందట. ఈ విషయం మీడియాకి లీక్ అవ్వడంతో ఫిలిమ్ నగర్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరి దానయ్య అంత ఈజీగా ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను వదిలేస్తాడా లేక వారిని కూడా నిర్మాణ భాగస్వామిగా చేర్చుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది.