అప్పటి వరకూ తెలుగు సినిమా మార్కెట్ మహా అయితే 70 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ‘బాహుబలి ది బిగినింగ్’ తరువాత అది 100 కోట్లు దాటింది. ఇక ‘బాహుబలి2’ తరువాత అది 150కోట్ల నుండీ 200కోట్ల వరకూ చేరింది. ఈరోజుతో ‘బాహుబలి ది బిగినింగ్’ రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అవుతుంది. 2015 జూలై 10న ఈ చిత్రం విడుదలయ్యింది. అసలు ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ.. అందరిలోనూ ఎన్నో అనుమానాలు.
‘ఈ చిత్రానికి 100కోట్లు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అది తిరిగి వచ్చే అవకాశం ఉందా.. తేడా వస్తే ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడిపోతాయి. ఒక్క రాజమౌళి, ప్రభాస్, అనుష్క.. మాత్రమే ఈ ప్రాజెక్టు కు పెద్ద దిక్కు. అయినంత మాత్రాన అంత బడ్జెట్ రికవర్ అవ్వడం సాధ్యం కాదేమో’ అంటూ ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ అయిన 7రోజుల్లోనే ‘బాహుబలి ది బిగినింగ్’ బడ్జెట్ ను మొత్తం రికవర్ చేసేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
43.40 cr
సీడెడ్
21.70 cr
వైజాగ్
9.70 cr
ఈస్ట్
9.45 cr
వెస్ట్
7.80 cr
కృష్ణా
6.80 cr
గుంటూరు
10.25 cr
నెల్లూరు
4.65 cr
ఏపీ + తెలంగాణ
113.75 cr
కర్ణాటక
39.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
60.45 cr
తమిళనాడు
35.5 cr
మలయాళం
5.25 cr
ఓవర్సీస్
47.85 cr
వరల్డ్ వైడ్ టోటల్
302.3 cr
‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రానికి 148కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం 302.3కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అంటే జరిగిన బిజినెస్ కు డబుల్ రప్పించిందనే చెప్పాలి. ఈ చిత్రం వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు బీజం పడింది. అంతే కాదు తెలుగు సినిమాని తక్కువ చేసే మిగిలిన పరిశ్రమలు కూడా ‘బాహుబలి’ ని మించే సినిమా తియ్యాలని పరితపిస్తున్నాయి.