టాలీవుడ్ జక్కన్న దర్శక ధీరుడు రాజమౌళి సందించిన విజువల్ వండర్ ‘బాహుబలి’. ఈ సినిమా మన భారత దేశ చలన చిత్ర రంగంలో ఎటువంటి భారీ విజయాన్ని సాదించిందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి బాహుబలి అక్కడ భారీ డిజాస్టర్ అంటే నమ్ముతారా…? నష్టం వచ్చింది అంటే నమ్మగలరా?? కానీ నమ్మక తప్పని నిజం అది…ఇంతకీ విషయం ఏమిటంటే…ఇండియాలో భారీ హిట్ అయిన ఈ సినిమాను విదేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు నిర్మాతలు.
ఇందుకోసం సినిమాను హాలీవుడ్ స్టాండర్ట్స్‌కు తగిన విధంగా నిపుణులతో ఎడిటింగ్ చేయించారు. ఆయా దేశాల్లో ఇంగ్లీషుతో పాటు ఆయా దేశాల బాషల్లో అనువాదం చేయించారు. అయితే అనేక దేశాల్లో… విడుదలయిన ఈ సినిమాకు మంచి స్పందనే లభించింది కానీ, జర్మనీలో మాత్రం భారీ పరాజయాన్ని చవి చూసింది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని జన్మనీలో 30 స్క్రీన్లలో రిలీజ్ చేసారు. ఇక్కడ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనాలు పెట్టుకున్న నిర్మాతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. తొలి వారాంతం ఈ చిత్రం ఇక్కడ కేవలం 4,166 యూరోలు (రూ. 3.17 లక్షలు) మాత్రమే వసూలు చేసింది. ఇక భారత్ లో భారీ విజయం సాధించడంతో ఈ సినిమా అక్కడ కూడా భారీ హిట్ అవుతుంది అన్న ఆశతో అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రానికి భారీ ధర చెల్లించి మరీ కొనుగోలు చేశారు…కానీ ఫలితం ఇంత దారుణంగా ఉంటుంది అని ఊహించలేదు…పాపం ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌలికి ఈ ఫలితం షాక్ ఇచ్చింది…