కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించ వలసిన ప్రాధాన్యత తెలియజేస్తున్నారు. కాగా కొందరు ఔత్సాహికులు అత్యంత ప్రజాధరణ పొందిన బాహుబలి సినిమాలోని క్లైమాక్స్ షాట్ ని తీసుకుని మాస్క్ ప్రాధాన్యత తెలియజేశారు. బాహుబలి 2 క్లైమాక్స్ సీన్ లో రానా ని చిత్తుగా ఓడించిన ప్రభాస్, అతని చావుకు ముందు కసిగా దగ్గరికి వచ్చి కళ్ళలోకి చూస్తాడు. ఈ ఎపిక్ షాట్ ని బాహుబలి 2 ట్రైలర్ లో కూడా రాజమౌళి కట్ చేశారు.
రానా, ప్రభాస్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునే ఆ క్లోజ్ అప్ షాట్ లో వారిద్దరికి మాస్కులు ఉన్నట్లుగా గ్రాఫిక్ చేశారు ఇద్దరు యువకులు. ఆ షాట్ లో రానా , ప్రభాస్ లకు వారు సెట్ చేసిన మాస్కులు చాలా సహజంగా నిజంగానే పెట్టుకొని మళ్ళీ నటించారా అన్నట్లుగా ఆ కొన్ని సెకన్ల వీడియో ఉంది. సామాజిక సందేశంతో కూడిన ఈ అద్భుత గ్రాఫిక్ డిజైన్ అవినాష్ కనల్ కన్నన్ మరియు లాజీజాక్సన్ గనియెవ్ అనే ఇద్దరు వి ఎఫ్ ఎక్స్ మేకర్స్ వారి టీమ్ తోచేశారు.
ఇక ఆ యువకుల ప్రయత్నం రాజమౌళిని ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో రాజమౌళి వారిని గుడ్ జాబ్ అంటూ మెచ్చుకున్నారు. సామాజిక దూరం.. మరియు మాస్క్ ప్రాధాన్యత తెలియజేసేలా వారు చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. వారి ప్రయత్నం మరియు ప్రతిభ జనాల్లోకి వెళ్లేలా వారు బాహుబలి 2 లోని ఆ సన్నివేశం ఎంచుకోవడం బాగుంది. ఈ వీడియో తరువాత ఈ ఇద్దరు గ్రాఫిక్ డిజైనర్స్ కి మంచి అవకాశాలు వచ్చే సూచనలు కలవు. లేదంటే ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి వి ఎఫ్ ఎక్స్ టీం లో సభ్యులుగా తీసుకోవచ్చు.