ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా ఆ కలెక్షన్లను బ్రేక్ చేయడం హిందీ సినిమాలకు కష్టమవుతోంది. బాలీవుడ్ లో చాలా సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. కొన్ని సినిమాలు హిస్టారికల్, మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో కూడా తెరకెక్కుతున్నాయి. అయితే వేర్వేరు బ్యాక్ డ్రాప్ లలో తెరకెక్కుతున్నా
ఈ సినిమాలు అభిమానుల అంచనాలను అందుకోవడంలో మాత్రం ఫెయిలవుతుండటం గమనార్హం. తాజాగా షంషేరా మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో బాహుబలి2 సాధించిన రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. షంషేరా సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించారు. బాహుబలి2 ఐదేళ్ల క్రితం సాధించిన తొలిరోజు కలెక్షన్లతో పోల్చి చూస్తే షంషేరా కలెక్షన్లు తక్కువ మొత్తంగా ఉండటం గమనార్హం.
షంషేరా కమర్షియల్ మాస్ మసాలా మూవీ అయినా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించకపోవడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం షాక్ కు గురవుతున్నారు. బాలీవుడ్ సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా గతంలోలా కలెక్షన్లను సాధించడం లేదు. బాహుబలి2 ఫుల్ రన్ లో హిందీలో సాధించిన కలెక్షన్లను బీట్ చేయడం ప్రస్తుతం విడుదలవుతున్న హిందీ సినిమాలకు కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాజమౌళి విజన్ వల్లే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధిస్తున్నాయని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!