తన జీవితంలో జరిగిన వ్యక్తిగత విషయం బేస్ చేసుకుని ‘బేబీ’ సినిమా కథ సిద్ధం చేశానని, తెరకెక్కించానని చెప్పిన దర్శకుడు సాయి రాజేశ్.. ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ ఆలోచన ఎలా వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎలా పట్టాలెక్కింది అనే వివరాలను వెల్లడించారు. అందరూ రోజూ వాడే వాట్సాప్ నుండే ఈ సినిమా కథ పుట్టింది అని సాయి రాజేశ్ వివరించారు. ఒక హీరో కథ కూడా విననని చెప్పాడట. ఇంకా ఆయన చాలా ఆసక్తిక వివరాలు చెప్పుకొచ్చారు.
దర్శకుడు ఓ వాట్సప్‌లో గ్రూప్ ఉన్నారట. అందులో తమిళనాడు రాష్ట్రంలోని సేలంకి చెందిన ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య జరిగిన ఓ సంఘటనకి సంబంధించిన ఫొటోలు వచ్చాయట. చూడ్డానికే అవి భయంకరంగా అనిపించాయట. ఇద్దరబ్బాయిలతో ఓ అమ్మాయి ఒకేసారి చనువుగా మెలిగిందంటే ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అనే ఆలోచన చేశారట ఆయన. అలా ఆ కోణంలో ఆలోచించడం వల్ల ‘బేబీ’ కథ పుట్టిందట.
ఇక సినిమా కథను రివర్స్‌లో రాసుకుంటూ వచ్చారట. అలా అని కథ ప్రభావం సమాజంపై చెడ ప్రభావం చూపించకుండా… క్లయిమాక్స్‌ను మార్చేశారట. ‘హృదయకాలేయం’ సినిమాను బౌండెడ్ స్క్రిప్ట్‌తో తీశారట సాయి రాజేశ్. అయితే ‘బేబీ’ సినిమాను మాత్రం ఏ రోజుకారోజు పాత్రల్ని గుర్తు చేసుకుంటూ రాశారట. స్క్రిప్ట్ లేకుండా తీసిన సినిమా ఇదేనట. ఇక ఆనంద్ దేవరకొండని ఎంపిక చేయడం కంటే ముందు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నారట.
ఓ హీరోని కలిశాక ఈ సినిమా సాయి రాజేశ్ హ్యాండిల్ చేయలేరేమో అని భయపడి వెనక్కి తగ్గాడట. మరో హీరోకి కథ చెప్పడానికి ట్రై చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకుడు అంటే.. సినిమా చేసే ప్రసక్తే లేదు’ అన్నారట. దాంతో రోజంతా చాలా బాధపడ్డారట. ఆ రోజే ఓ మంచి సినిమా తీసి చూపించాలని నిర్ణయించుకున్నారట. (Baby Movie) ‘బేబి’తో ఆ ప్రయత్నం నెరవేరిందని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు