Sai Rajesh: సాయి రాజేశ్ మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే.. అలా చేయడంతో?

బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో డైరెక్టర్ సాయి రాజేశ్ పేరు మారుమ్రోగుతోంది. బేబీ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బేబీ మూవీ సక్సెస్ తో యంగ్ జనరేషన్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు సాయి రాజేశ్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాయి రాజేశ్ డైరెక్షన్ లో నటిస్తే ఆ నటీనటుల కెరీర్ కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే సాయి రాజేశ్ తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని మేనల్లుడికి తన వంతు సహాయం చేసి వార్తల్లో నిలిచారు. సాయి రాజేశ్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేనల్లుడు గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతుండగా ఈ విషయం సాయి రాజేశ్ దృష్టికి వచ్చింది. పవన్ అభిమాని ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది.

ఈ పోస్ట్ తన దృష్టికి రావడంతో సాయిరాజేశ్ వెంటనే స్పందించి సాయం చేశారు. డబ్బులు సంపాదించడం గొప్ప కాదని సహాయం చేసే గుణం ఉండటం గొప్ప అని ఆ విషయంలో సాయి రాజేశ్ ఎన్నో మెట్లు పైకి ఎక్కారని మరి కొందరు చెబుతున్నారు. సాయి రాజేశ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేయాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాయి రాజేశ్ (Sai Rajesh) స్టార్ హీరోలతో సినిమాలను ప్లాన్ చేస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. బడ్జెట్ కు న్యాయం చేసి నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించే వాళ్లలో సాయి రాజేశ్ ముందువరసలో ఉంటారు. తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తే సాయి రాజేశ్ కు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయి రాజేశ్ వేగంగా సినిమాలు తీయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus