ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే టైటిల్ పెడుతున్న బోయపాటి..!

బాలయ్యబాబు బోయపాటి శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న ఈ క్రేజీ కాంబో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. బిబి3 అంటూ టైటిల్ ని ఎనౌన్స్ చేయకుండానే ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపిన ఈ సినిమా ఇప్పుడు మే 28వ తేదిన విడుదల అవ్వబోతోందని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. మరి ఇంతకీ ఈ సినిమాకి టైటిల్ ఏంటా అని ఆరాతీస్తే ఆసక్తికమైన టైటిల్స్ ఎన్నో వినిపిస్తున్నాయి.

సింహా, లెజెండ్ లాంటి సినిమాల టైటిల్స్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్ లో ‘మోనార్క్’ అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. ఫ్యాన్స్ కోరికమేరకు ఈ టైటిల్ ని పెట్టాలని చూస్తోందట బోయపాటి అండ్ టీమ్. సోషల్ మీడియాలో ఇప్పటికే బాలయ్య పోస్టర్ పెట్టి మోనార్క్ అంటూ టైటిల్ ని క్రియేట్ చేసి మరీ పోస్టర్స్ రిలీజ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే, ఈ టైటిల్ ని ఎప్పుడు రివీల్ చేస్తారు, అఫీషియల్ గా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అనేది మాత్రం ఆసక్తికరం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 11వ తేదిన మహాశివరాత్రి రోజున ఈ సినిమా టైటిల్ ని ఎనౌన్స్ చేయబోతున్నారట. ఇందులో బాలయ్యబాబు అఘోరా గెటప్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమాకి థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. అదీ విషయం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus