తనయుడి సినీ ఎంట్రీకి దర్శకుడిని ఖరారు చేసిన బాలకృష్ణ
- December 1, 2016 / 10:36 AM ISTByFilmy Focus
నటసింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞని వెండితెరపై చూసుకోవాలని అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడిగా నిరూపించుకోవాలని మోక్షజ్ఞ కూడా తపిస్తున్నాడు. అందుకే విదేశాల్లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో నటనలో శిక్షణ పొందుతున్నాడు. బాలకృష్ణ తనయుడి సినీ ఎంట్రీ కోసం మంచి కథ, డైరక్టర్ కోసం కొంతకాలంగా గాలిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మోక్షజ్ఞని క్రిష్ డైరక్షన్లో హీరోగా పరిచయం చేయాలనీ ఫిక్స్ అయ్యారంట.
ప్రస్తుతం ఈ డైరక్టర్ తో గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ ని బాలయ్య చేస్తున్నారు. క్రిష్ టేకింగ్ కి నట సింహ ఫిదా అయ్యారని, అందుకే కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత అతనిపై పెట్టారని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. మోక్షజ్ఞ మొదటి సినిమా తన బ్యానర్లోనే చేయాలని వారాహి చలన చిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి పట్టుబట్టి కూర్చున్నారు. తమ సినిమా కోసం “రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య” అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. నిర్మాత విషయంలో మాత్రం మార్పులేదని తెలిసింది. కథా చర్చల స్థాయిలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















