నందమూరి తారకరత్న కోలుకుని తిరిగి రావాలని ఎక్కువగా కోరుకున్నది నందమూరి బాలకృష్ణే అని చెప్పాలి. నిద్రాహారాలు మానేసి మరీ తారకరత్న కోసం ఆయన నారాయణ హృదయాల హాస్పిటల్ లో పడి ఉన్న రోజులు ఉన్నారు. చిత్తూరులో ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు కూడా నిర్వహించారు బాలయ్య. అంతేకాదు తారకరత్న ఆరోగ్యం బాగుపడే వరకు తన సినిమా షూటింగ్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మొదటి నుండి తారకరత్నతో బాలయ్యకి బాండింగ్ ఎక్కువ. అతను హీరోగా సక్సెస్ అవ్వకపోతే విలన్ గా ఛాన్సులు ఇప్పించింది బాలయ్యే అని అంతా అంటుంటారు..!
అలాగే కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుంటే… నందమూరి కుటుంబం తారకరత్నని పక్కన పెట్టింది. ఈ క్రమంలో మళ్ళీ అతన్ని కుటుంబానికి దగ్గర చేసింది బాలయ్యే. అన్ని విషయాల్లోనూ తారకరత్నకి అండగా నిలబడ్డాడు బాలయ్య. అలాంటిది నిన్న తారకరత్న ఇక లేడు అని తెలిసినప్పటి నుండి బాలయ్య చాలా ఎమోషనల్ అవుతున్నట్టు వినికిడి.
ఇక తారకరత్న మరణం పై బాలయ్య స్పందిస్తూ.. “బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా… నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు.
కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారకరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.