NBK107: బాలయ్య గోపీచంద్ మూవీ స్టోరీ లైన్ ఇదేనా?

స్టార్ హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోయినా ఇప్పటికే రిలీజైన లుక్ వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో ఆ స్థాయి హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ లీకైంది.

Click Here To Watch

శృతిహాసన్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. గోపీచంద్ మలినేని యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడం గమనార్హం. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో తండ్రీకొడుకులుగా కనిపిస్తారని సమాచారం అందుతోంది. ప్రజల కోసం నీటి సమస్యపై పోరాడే పాత్రల్లో తండ్రీకొడుకు కనిపిస్తారని తెలుస్తోంది.

అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బ్రేక్ చేయగా ఈ సినిమా కూడా రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ విజయాలను అందుకుంటున్నాయి. బాలయ్య సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిసుండగా ఈ సినిమాతో పాటు బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా నటించనున్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అభిమానులు ఇష్టపడే కథలకు బాలయ్య ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus