నందమూరి బాలకృష్ణకు మాస్ ఆడియన్స్ లో యమ క్రేజ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి తరువాత సీనియర్ హీరోల్లో మాస్ హిట్ కొట్టగలిగే కెపాసిటీ బాలయ్యకు మాత్రమే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలయ్య కాస్త కోపిష్టి అయినప్పటికీ .. సేవ కార్యక్రమాల విషయాల్లో ఎప్పుడూ ముందుంటాడని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. ఇటీవల అనంతపురం లోని సోమనాథ్ నగర్ కు చెందిన స్వప్న అనే ఇంటర్మీడియట్ విద్యార్థినికి క్యాన్సర్ సోకింది. ట్రీట్ మెంట్ కోసం 6 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు స్వప్న కుటుంబ సభ్యులకి తెలిపారట. ఆమె తండ్రి ఓ లారీ డ్రైవర్. ఇంట్లో కనీస అవసరాలకి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో 6 లక్షలు వీళ్ళు ఎక్కడినుండీ తీసుకొస్తారు.
ఈ క్రమంలో సహాయం నిమిత్తం స్వప్న కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్న తరుణంలో…. స్వప్న క్లాస్ మేట్స్ … నందమూరి బాలకృష్ణ దృష్టికి ‘బసవతారకం’ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా తీసుకొచ్చి సహాయం కోసం ట్రై చేశారు. విషయాన్ని తెలుసుకొన్న వెంటనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ కూడా అయిన బాలకృష్ణ… స్వప్న స్నేహితుల ద్వారా వారి కుటుంబ సభ్యులను హాస్పిటల్ కు పిలిపించి… వారితో మాట్లాడి వివరాలను తెలుసుకొన్నారు. క్యాన్సర్ పేషెంట్ అయిన స్వప్న తో పాటూ వారి తల్లితండ్రులకు కూడా ధైర్యంగాBasava ఉండమని చెప్పారు బాలయ్య. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని హిందుపురం ఎం.ఎల్.యే అయిన బాలకృష్ణ సదరు యువతికి చికిత్స వెంటనే అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే వైద్యులు చికిత్స ప్రారంభించి, అందులో భాగంగా అవసరమైన శస్త్ర చికిత్సతో పాటూ ఇతర సంబంధిత వైద్యాన్ని ఉచితంగా అందించబోతున్నారు. త్వరలోనే స్వప్న కోలుకుని తిరిగి మామూలు మనిషి అవుతుందని వైద్యులు చెప్పడంతో వారి తల్లిదండ్రులు బాలయ్యకు కృజ్ఞతలు తెలియజేసారు.