Balakrishna: బాలయ్యను కొత్తగా చూపించడానికి అనిల్‌ ఫిక్స్‌ అయ్యారట!

‘వీర సింహా రెడ్డి’గా సంక్రాంతికి వచ్చి అదరగొట్టాడు బాలకృష్ణ. సీమ నేపథ్యంలో బాలయ్య సినిమా తీస్తే తిరుగుండదు అని మరోసారి నిరూపించాడు. అయితే ఇప్పుడు తన తర్వాతి సినిమా నేపథ్యం కోసం కొత్త ప్రాంతాన్ని ఎంచుకున్నాడని సమాచారం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య సినిమా గురించే చెబుతున్నాం. ఇప్పటికే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న సినిమా అని వార్తలొచ్చిన ఈ సినిమా నేపథ్యం కూడా వైవిధ్యంగానే ఉండబోతోందట. బాలకృష్ణ సినిమాల్లో తక్కువగా కనిపించే తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారట.

ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమాను త్వరలో ఫుల్‌ స్పీడ్‌లో షురూ చేస్తారు. ‘వీర సింహా రెడ్డి’ ప్రచారం కోసం ఈ మధ్య బాలయ్య కాస్త కొత్త సినిమాకు గ్యాప్‌ ఇచ్చారు. మరోవైపు ‘అన్‌స్టాపబుల్‌ 2’ షూటింగ్‌ కూడా పూర్తయింది. దీంతో అనిల్‌ రావిపూడి సినిమాను ఫుల్‌ జోష్‌లో ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడతారు అని తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్న వయసులో కనిపస్తాడు.

ఆ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రలో అంజలి నటిస్తోందని సమాచారం. తండ్రీ కూతుళ్ల ఎమెషన్స్‌, సరదాలు, పగలు ప్రతీకారాల నేపథ్యంలో సినిమా సాగుతుంది అంటున్నారు. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ రేంజిలో ఇందులో ఎలివేషన్లు, యాక్షన్లు ఉంటాయని చెబుతున్నారు. బాలయ్య అలా తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే మామూలుగా ఉండదు అనేది అభిమానుల అంచనా. అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఉండే కమర్షియల్‌ ఎలిమెంట్లు, ఫన్‌ ఈ సినిమాలోనూ ఉంటాయట.

అయితే వాటికి బాలయ్య స్టైల్‌ మాస్‌, యాక్షన్‌ జోడిస్తున్నారట. అన్నట్లు సినిమా ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్‌గా ఉంటుంని చెబుతున్నారు. కూతురు కోసం బాలయ్య చేసే పోరే ఈ సినిమా అని అర్థమవుతోంది. అయితే ఆ పోరు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేశాడు అనేది సినిమాలో కీలకం. అన్నట్లు విలన్‌ పాత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది అని కూడా చెబుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus