Balayya, Charan: చరణ్‌కు కాల్‌ చేసి బాలయ్య ఏమన్నారంటే?

బాలకృష్ణ అంటే మాస్‌ హీరో, యాక్షన్‌ స్టార్‌ అని అంటుంటారు. తన సినిమాలతో ఆ రేంజ్‌ పేరును తెచ్చుకున్నారు. ఆఫ్‌ స్క్రీన్‌ బాలయ్యను చూస్తే చాలా కోపమొక్కువ అనేస్తారు. అయితే అతని గురించి పూర్తిగా తెలిసినవాళ్లు అయితే భోళా శంకరుడు అని కూడా అంటుంటారు. బాలయ్య కూల్‌గా ఉంటారు, వినయంగా ఉంటారు అని చెబుతారు. ఇవన్ని మనకు తెలియదు కానీ ‘అన్‌స్టాపబుల్‌’ షో వచ్చాక బాలయ్య అంటే ఏంటో తెలిసిపోయింది. ఎలాంటి బేషజాలు లేకుండా కుర్ర హీరోలతో కూడా కలసిపోయి షో చేస్తున్నారు. తాజాగా ఉదాహరణ ప్రభాస్‌ ఎపిసోడ్‌లో జరిగింది.

బాలయ్య ఏదైనా సరే ముఖం మీదే చెప్పేస్తారు, అడిగేస్తారు అంటారు. ఇప్పుడు అదే పని చేశారు మరోసారి. ప్రభాస్‌ ముఖ్య అతిథిగా ‘అన్‌స్టాపబుల్‌’ రెండు ఎపిసోడ్‌లు త్వరలో రానున్నాయి. ఒక ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ మొదలైంది కూడా. అయితే ఈ షోలో ప్రభాస్‌ స్నేహితుడు అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రజెన్స్‌ కూడా ఉంది అనే విషయం తెలిసిందే. అంటే నేరుగా రామ్‌చరణ్‌ రాలేదు కానీ.. ఫోన్‌ కాల్‌ ద్వారా మాట్లాడాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమోల్లో కూడా ఇది తెలుస్తుంది.

తొలి ప్రోమోలో ప్రభాస్‌ పెళ్లి విషయంలో ఇరికించేశాడు. దానికి ప్రభాస్‌ ‘చరణ్‌ నువ్వు నా ఫ్రెండ్‌వా ఎనిమీవా’ అని కూడా అడిగాడు. అయితే రెండో ప్రోమోలో ఆసక్తికర అంశం ఒకటి కనిపించింది. రామ్‌చరణ్‌తో ఫోన్‌ మాట్లాడే క్రమంలో బాలకృష్ణ ‘చరణ్‌ సంక్రాంతికి నువ్వు ముందు నా సినిమా చూడాలి. ఆ తర్వాత మీ నాన్న సినిమా చూడాలి’ అని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వేశారు. దీంతో బాలయ్య మాస్‌.. మామూలుగా ఉండదు అని అంటున్నారు.

నిజానికి సంక్రాంతికి అదే జరుగుతుంది. బాలయ్య, చిరంజీవి పొంగల్‌ వార్‌ కోసం బాక్సాఫీసు దగ్గరకు వస్తున్నారు. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ జనవరి 12న వస్తుంది. చిరు ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న వస్తుంది. ఆ లెక్కన ముందు బాలయ్య సినిమా చూడాల్సిందే.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus