Balakrishna: బాలయ్యతోనే మళ్ళీ ఆ ఇద్దరు.. క్రేజీ కాంబినేషన్!
- October 24, 2024 / 02:51 PM ISTByFilmy Focus
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల హవా ఏమాత్రం తగ్గడం లేదు. యువ హీరోలకు దీటుగా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల వరుస హిట్లతో జోష్ మీదున్న ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ (కె.ఎస్. రవీంద్ర) (Bobby) డైరెక్షన్‌లో తన 109వ సినిమాను చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ‘సర్కార్ సీతారామ్’ పేరుతో రాబోతుందని సమాచారం.
Balakrishna

అలాగే, ఆయన అభిమానుల కోసం మరొక సర్‌ప్రైజ్ కూడా రెడీగా ఉంది. బాలయ్య (Balakrishna) తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అఖండ’(Akhanda) సీక్వెల్ కావడం విశేషం. ‘అఖండ 2.. తాండవం’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నా బాలయ్య మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు సూపర్ హిట్లను అందించిన ఇద్దరు దర్శకులు మరోసారి బాలయ్యతో జట్టు కట్టబోతున్నారని ఫిలిం నగర్ టాక్. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ లిస్ట్‌లో ముందున్నారు. ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమా ద్వారా భారీ విజయం అందించిన గోపీచంద్ మలినేని బాలయ్య కోసం మరో కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం సన్నీ డియోల్‌తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న గోపీచంద్, అది పూర్తయిన వెంటనే బాలయ్య ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టబోతున్నారు.

ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. అదే విధంగా, ఇటీవల ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) సినిమాతో బాలయ్యకు మరో హిట్ అందించిన అనిల్ రావిపూడి కూడా మరో ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేస్తున్న అనిల్, ఆ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత మళ్లీ బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఎప్పుడు ఈ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారో చూడాలి.
















