టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పారితోషికం ఎక్కువగానే అందుకుంటూ ఉంటారు. కాకపోతే.. కొన్ని సినిమాల విషయంలో మహేష్ బాబు… పారితోషికం విషయంలో కొంచెం డిఫరెంట్ గా వ్యవహరిస్తుంటారు. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మహేష్ బాబు పూర్తి పారితోషికం తీసుకోలేదు. ఆ సినిమాకి మహేష్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.’సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) విషయంలో కూడా అంతే..! గతంలో చేసిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘బ్రహ్మోత్సవం’ (Brahmotsavam) సినిమాల విషయంలో కూడా మహేష్ బాబు ఇదే పద్ధతిని అనుసరించారు.
Mahesh Babu
ఒక్క ‘బ్రహ్మోత్సవం’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు కమర్షియల్ గా మహేష్ బాబుకి కలిసొచ్చాయి. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకి ఔట్ రైట్ గా రూ.60 కోట్లు పారితోషికం అందుకున్నారు మహేష్ బాబు. ఇక ఇప్పుడు రాజమౌళితో (S. S. Rajamouli) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై ఎస్.గోపాల్ రెడ్డి, కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పలు హాలీవుడ్ సంస్థలు కూడా నిర్మాణంలో భాగం అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు పారితోషికం ముందుగా ఏమీ తీసుకోవడం లేదట. వాస్తవానికి ‘పోకిరి’ (Pokiri) టైంలో ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ వారు మహేష్ బాబు, రాజమౌళి..లకి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టు కచ్చితంగా పాన్ వరల్డ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం అందరికీ ఉంది. అందుకే మహేష్ సినిమా పూర్తయ్యేవరకు పారితోషికం తీసుకోవట్లేదట.
ఫ్లైట్ టికెట్స్, స్టార్ హోటల్స్ లో రూమ్స్ బుక్ చేయడం వంటివి నిర్మాతలే చేస్తారు. మహేష్ కి మాత్రమే కాదు మహేష్ టీంకి కూడా..! ఇక సినిమా ఫినిష్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి.. బిజినెస్ లో కొంత వాటా అలాగే లాభాల్లో కొంత వాటా మహేష్ బాబు తీసుకుంటారని తెలుస్తోంది. వాటి వ్యాల్యూ రూ.250 కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.